బాలీవుడ్ లోకి భీమ్లా నాయక్…నేడు ట్రైలర్ రిలీజ్ కి రెడీ!

Published on Mar 3, 2022 4:26 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం ను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాక పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం గా నిలిచింది.

ఈ చిత్రం లాంగ్ రన్ లో భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ చిత్రం ను హిందీ వెర్షన్ లో విడుదల చేయాల్సి ఉండగా, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కాస్త ఆలస్యం కావడం తో వాయిదా పడింది. ఈ చిత్రం ను బాలీవుడ్ లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. నేడు ఈ చిత్రం ట్రైలర్ ను రిలీజ్ చేయనున్న విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఈ చిత్రం రిలీజ్ డేట్ మరియు ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :