లేటెస్ట్..”భీమ్లా నాయక్” ఓటిటి హక్కులు వారి చెంతకు.?

Published on Feb 17, 2022 10:00 am IST


ఇప్పుడు మన టాలీవుడ్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న లేటెస్ట్ భారీ సినిమా “భీమ్లా నాయక్”. అభిమానులు అయితే క్రేజీ గా ఈ సినిమా కోసం ఎదురు చూస్తుండగా రాబోయే ఎనిమిది రోజులు మాత్రం ఫీస్ట్ ఇంకో లెవెల్లో ఉండనుంది అని ఆల్రెడీ అర్ధం అవుతుంది.

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓటిటి డీల్ పై టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రం తాలుకా ఓటిటి హక్కులను ప్రపంచ ప్రముఖ ఓటిటి సంస్థ ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ వారు ఫ్యాన్సీ ప్రైస్ ఇచ్చి కొనుగోలు చేశారట. దీనితో ఈ సినిమా స్ట్రీమింగ్ పార్ట్నర్ కన్ఫర్మ్ అయ్యినట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాని దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తుండగా రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్నాడు. అలాగే సంయుక్త మీనన్ మరియు నిత్య మీనన్ లు ఈ సినిమా హీరోయిన్స్ గా నటించారు. అలాగే థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :