‘భీమ్లా నాయక్’ ఓటీటీ స్ట్రీమింగ్ తేది వచ్చేసింది..!

Published on Mar 18, 2022 12:16 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్‌గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. భారీ అంచనాల మధ్య గత నెల 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుని భారీగా కలెక్షన్లను రాబట్టుకుంటుంది. అయితే ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గుడ్‌న్యూస్ వచ్చింది.

‘భీమ్లా నాయక్’ సినిమా డిజిటల్ హక్కులను ఆహా మరియు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని మార్చి 25 నుంచి స్ట్రీమింగ్‌కి తీసుకొస్తున్నట్టు తాజాగా రెండు సంస్థలు ప్రకటించాయి. ఇదిలా ఉంటే ఇందులో నిత్యా మీనన్, సంయుక్త మీనన్‌లు హీరోయిన్స్‌గా నటించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే ఇవ్వగా, థమన్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :