“భీమ్లా నాయక్” ఓటీటీలోకి వచ్చేందుకు అంత టైం పడుతుందా?

Published on Feb 18, 2022 12:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్‌గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ చిత్రం ఫిబ్రవరి 25న రిలీజ్ కాబోతుంది. దీంతో “భీమ్లా” రచ్చను పవన్ ఫ్యాన్స్ మొదలెట్టేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా శాటిలైట్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరియు ఆహా సొంతం చేసుకున్నాయని, అందుకుగాను ఈ రెండు ఓటిటీలు బాగానే ముట్టచెప్పినట్లు తెలుస్తుంది.

అయితే ప్రస్తుతం థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాలు 15 రోజులు లేదా 30 రోజుల్లో ఓటీటీలోకి వస్తున్నాయి. కానీ భీమ్లా నాయక్ మాత్రం రెండు నెలలు వరకు ఓటీటీలోకి రిలీజ్ చేయకూడదని మేకర్స్ అగ్రిమెంట్ చేసుకున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే ఫిబ్రవరి 25న ఈ సినిమా రిలీజ్ అయితే ఏప్రిల్ వరకు ఓటీటీలోకి రాదని తెలుస్తోంది. ఇక సినిమా సక్సెస్ సాధించి భారీ వసూళ్లను కనుక రాబడితే ఓటీటీలోకి రావడానికి ఇంకాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశం కూడా ఉండే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :