భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక వాయిదా!

Published on Feb 21, 2022 12:53 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి, సంయుక్త మీనన్, నిత్య మీనన్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. భీమ్లా నాయక్ ఈ నెల 25 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్‌లో జరగాల్సి ఉంది.

అయితే ఏపీ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతితో ఆ కార్యక్రమాన్ని రద్దు చేసి ఆ తర్వాత నిర్వహించాలని పవన్ నిర్ణయించుకున్నారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. మరియు ఈరోజు విడుదల కావాల్సిన ట్రైలర్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రీ రిలీజ్ వేడుక నేడు జరగాల్సి ఉంది. అయితే మంత్రి మృతి తో ప్రీ రిలీజ్ వేడుక ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా కు మాటలు అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :