“భీమ్లా నాయక్” థియేటర్ల లోనే…క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్!

Published on Sep 27, 2021 10:50 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం ను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని సినిమాలు డైరెక్ట్ ఓటిటి గా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం కూడా డైరెక్ట్ ఓటిటి గా వచ్చే అవకాశం ఉంది అంటూ వస్తున్న వార్తల పై నిర్మాత నాగ వంశీ స్పందించారు.

పవర్ స్ట్రొమ్ ను థియేటర్ల లోనే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాక అహంకారానికి మరియు ఆత్మ గౌరవం కి మధ్యన జరిగే అల్టిమేట్ యుద్దానికి రెడీ గా ఉండండి అంటూ చెప్పుకొచ్చారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :