అయినా వారి మనసు నొచ్చు కోవటం పట్ల క్షంతవ్యుడిని… భీమ్లా నాయక్ నిర్మాత కీలక వ్యాఖ్యలు!

Published on Feb 18, 2022 8:00 pm IST

ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ తన డీజే టిల్లు విడుదల అయిన రోజు మీడియా తో చేసిన వ్యాఖ్యలు పట్ల ఇంకా పలు చోట్ల చర్చలు జరుగుతున్నాయి. ఈ మేరకు నిర్మాత సూర్య దేవర నాగ వంశీ సోషల్ మీడియా వేదిక గా ఒక ప్రెస్ ను విడుదల చేయడం జరిగింది.

ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం. వారే ఏ నిర్మాణ సంస్థ కి అయినా బలం. ప్రేక్షకులు పెట్టే విలువైన డబ్బుకి మించిన వినోదం అందించాం అనే ఆనందం లో డీజే టిల్లు విడుదలైన రోజు మీడియా తో మాట్లాడుతూ అన్న మాటలు ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించాయన్న వార్తలు తెలిసి బాధపడ్డాను. ప్రేక్షకులను ఏక వచనం తో సంబోధిస్తూ మాట్లాడటం, వారిని నా సొదరులుగా భావించడం వలనే, అయినా వారి మనసు నొచ్చు కోవటం పట్ల క్షంతవ్యుడిని, ముందుగా చెప్పినట్లే ఎప్పటికీ ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం, వారే మా బలం అంటూ చెప్పుకొచ్చారు. ఈ ప్రెస్ నోట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :