“భీమ్లా నాయక్” ర్యాప్ సాంగ్‌పై తమన్ అప్డేట్..!

Published on Mar 5, 2022 3:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్‌గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. భారీ అంచనాల మధ్య గత నెల 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకుపోతోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ అప్డేట్‌ని ఇచ్చాడు.

భీమ్లా నాయక్ ర్యాప్ సాంగ్ వచ్చేస్తుందని, బాణాసంచా కాల్చేందుకు అభిమానులు సిద్దంగా ఉండాలని అన్నాడు. అయితే క్లైమాక్స్ ర్యాప్ సాంగ్‌ని విడుదల చేయాలని చాలా మంది ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇదిలా ఉంటే నిత్యా మీనన్, సంయుక్త మీనన్‌లు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే ఇచ్చాడు.

సంబంధిత సమాచారం :