అద్దిరిపోయిన “భీమ్లా నాయక్” లోని మరో షేడ్.!

Published on Oct 15, 2021 1:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు కీలక పాత్రలోకి నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్” కోసం అందరికీ తెలిసిందే. ఒక్కో అప్డేట్ తో భారీ హైప్ లోకి తీసుకెళ్తున్న ఈ చిత్రం నుంచి ఈరోజు దసరా కానుకగా మోస్ట్ అవైటెడ్ సెకండ్ సింగిల్ “అంత ఇష్టం” ని మేకర్స్ ఇప్పుడు రిలీజ్ చేసారు. మరి దీనికోసం మాట్లాడుకున్నట్టయితే మొదట భీమ్లా నాయక్ లోని అగ్రెసివ్ షేడ్ ని ప్రెజెంట్ చేసిన మేకర్స్ ఇప్పుడు భీమ్లా లోని మరో షేడ్ ని చూపించారు.

ఇది కూడా కంప్లీట్ కొత్తగా చాలా బావుందని చెప్పాలి. రామజోగయ్య శాస్త్రి గురై సాహిత్యం ఎంత చక్కగా అయితే ఉందో అదే విధంగా థమన్ ఫస్ట్ నుంచీ ఇచ్చిన ట్యూన్ అంతా కూడా అంతే కొత్తగా చాలా రిఫ్రెషింగ్ గా ఉందని చెప్పాలి. ఇంకా సీనియర్ సింగర్ చిత్ర గారి గాత్రంతో ఈ సాంగ్ ఇంకో లెవెల్లోకి వెళ్ళింది.

ఇంకా ఇందులో చూపించిన కొన్ని విజువల్స్ కూడా సినిమాపై మంచి ఆసక్తి పెంచుతున్నాయి. ఓవరాల్ గా మాత్రం భీమ్లా సెకండ్ సింగిల్ కూడా పెద్ద చార్ట్ బస్టర్ అయ్యి తీరుతుంది అనిపిస్తుంది. మరి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :