“భీమ్లా నాయక్”కి కలెక్షన్స్ పరంగా శివరాత్రి కలిసొచ్చిందా?

Published on Mar 2, 2022 2:10 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్‌గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళ్తూ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల షేర్‌ను క్రాస్ చేసిన ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లను రాబడుతోంది.

అయితే మహా శివరాత్రి పర్వదినం కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం ఆక్యుపెన్సీ బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం మంగళవారం మంచి కలెక్షన్స్ వచ్చి ఉంటాయని, ఇది సోమవారం కంటే ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉంటే నిత్యా మీనన్, సంయుక్త మీనన్‌లు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే ఇవ్వగా, థమన్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :