టాక్..పవన్ ప్లాన్ కి తగ్గట్టుగా “భీమ్లా నాయక్” షూట్.?

Published on Dec 17, 2021 7:02 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. అయితే ఇప్పుడు ఫైనల్ షెడ్యూల్ నే చిత్ర యూనిట్ వికారాబాద్ కొండ ప్రాంతాల్లో చేస్తున్నారు.

అలాగే ఈ షూట్ లో పవన్ మరియు రానా లపై కీలక సన్నివేశాలు చేస్తుండగా లేటెస్ట్ టాక్ ఒకటి ఈ షూట్ పై వినిపిస్తుంది. ఈ టోటల్ షెడ్యూల్ ని పవన్ వెకేషన్ కి వెళ్లే వారం లోపు కంప్లీట్ చేసేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంటే బహుశా ఇంకొన్ని రోజుల్లో ఈ షూటింగ్ కంప్లీట్ అయ్యిపోవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

సంబంధిత సమాచారం :