టాక్..”భీమ్లా నాయక్” ని మరీ అంత సినిమాగా కట్ చేసారా?

Published on Jan 25, 2022 8:00 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ సినిమా “భీమ్లా నాయక్” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ కూడా ఆల్ మోస్ట్ కంప్లీట్ కావస్తుండగా ఆసక్తికర బజ్ ఈ చిత్రంపై ఇప్పుడు వైరల్ అవుతుంది.

లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమా కి చెందిన రన్ టైం పైనే ఊహాగానాలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకి షాకింగ్ రన్ టైం ని మేకర్స్ లాక్ చేశారట. కేవలం రెండు గంటల 10 నుంచి 12 నిమిషాలు మాత్రమే బీమ్లా నాయక్ ట్రీట్ ఉంటుందట. ఇది ఈ మధ్య కాలంలో వచ్చిన అనేక సినిమాల్లో అందులోని మన స్టార్ హీరోస్ లో అయితే చాలా తక్కువని చెప్పాలి.

కానీ మేకర్స్ మాత్రం ఇప్పుడు వరకు వచ్చిన అవుట్ పుట్ తో చాలా హ్యాపీగా ఉన్నారట. అందుకే చాలా కాన్ఫిడెన్స్ గా ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి ఇన్ని రోజులు ఆసక్తి కనబరిచినట్టు తెలుస్తుంది. మరి వేచి చూడాలి నిజంగానే భీమ్లా నాయక్ సినిమా ఇంత చిన్నదా కాదా అని.

సంబంధిత సమాచారం :