యూఎస్ బాక్సాఫీస్ షేక్ చేస్తున్న “భీమ్లా నాయక్” బ్లాస్ట్.!

యూఎస్ బాక్సాఫీస్ షేక్ చేస్తున్న “భీమ్లా నాయక్” బ్లాస్ట్.!

Published on Feb 27, 2022 10:52 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా నటించిన లేటెస్ట్ పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ “భీమ్లా నాయక్”. దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే సాలిడ్ పాజిటివ్ మౌత్ టాక్ అందుకుని అదరగొడుతుంది. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సహా యూఎస్ఏ బాక్సాఫీస్ దగ్గర కూడా దుమ్ము లేపుతున్నట్టు తెలుస్తుంది.

ఆల్రెడీ 1 మిలియన్ డాలర్స్ ని ప్రీమియర్స్ తో కలిపి సింగిల్ డే లో ఈ చిత్రం వసూలు చెయ్యగా ఈ వీకెండ్ నాటికి 1.5 మిలియన్ డాలర్స్ ని వసూలు చేసిందట. అలాగే డెఫినెట్ గా భీమ్లా నాయక్ అక్కడ 2 మిలియన్ క్లబ్ లో కూడా చేరుతుంది అని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ చిత్రం 1.8 మిలియన్ డాలర్స్ దగ్గర ఉందట. ఇది పవన్ కెరీర్ లో మరో ఫాస్టెస్ట్ రన్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందివ్వగా నాగవంశీ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు