“భీమ్లా నాయక్” సాంగ్ అధికారికంగా వాయిదా..కారణం ఇదే?

Published on Dec 1, 2021 8:05 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్”. అంతకంతకు మంచి అంచనాలు పెంచుకుంటూ వెళుతున్న ఈ భారీ సినిమా ఇప్పుడు ఫైనల్ షూట్ కి వచ్చేసింది.

మరి ఇదిలా ఉండగా నిన్ననే చిత్ర యూనిట్ ఈ చిత్రం నుంచి నాలుగో పాటను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అడవి తల్లి మాట అనే ఈ పాటను ఈరోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ చెయ్యాల్సి ఉండగా మేకర్స్ దానిని వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా కన్ఫర్మ్ చేసారు.

కొన్ని కారణాలు చేత ఈ సాంగ్ ని ఈరోజు రిలీజ్ చెయ్యడం లేదని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ వారు తెలియజేసారు. అయితే దీనికి కారణం దిగ్గజ సాహిత్య రచయిత ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి గారి అకాల మరణమే అని తెలుస్తుంది. ఈ సమయంలో ఇలాంటి అప్డేట్స్ సరైంది కాదని వారి గౌరవార్ధం వాయిదా వేశారు.

సంబంధిత సమాచారం :