సంయుక్త మీనన్‌కి వెల్‌కమ్ చెప్పిన భీమ్లా టీమ్..!

Published on Oct 28, 2021 5:32 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి హీరోలుగా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియం’ చిత్రాన్ని సాగర్ కె చంద్ర “భీమ్లా నాయక్‌” పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వదిలిన పవన్ కళ్యాణ్ టీజర్‌కు, టైటిల్ సాంగ్‌కు మరియు రానా ఫ‌స్ట్ గ్లింప్స్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తుంది. కాగా ఇప్పటి వరకు చిత్ర యూనిట్ పవన్-నిత్యామీనన్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తూ వచ్చారు. ఇక రానా-సంయుక్త మీనన్ కాంబినేషన్ సీన్లను చిత్రీకరించవలసి ఉంది. తాజాగా ఆమె ఈ సినిమా షూటింగుకి హాజరైంది. దీంతో భీమ్లా నాయక్‌ చిత్ర యూనిట్ సంయుక్తకు వెల్‌కమ్ చెబుతూ ఒక పోస్టర్‌ని రిలీజ్ చేసింది. ఇకపోతే ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More