భీమ్లా నాయక్‌ సాంగ్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

Published on Sep 4, 2021 3:00 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి హీరోలుగా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియం’ చిత్రాన్ని సాగర్ కె చంద్ర “భీమ్లా నాయక్‌” పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ సాంగ్‌పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ సాంగ్‌ని కేవలం కవర్ సాంగ్‌గా మాత్రమే రిలీజ్ చేశారు. ఈ కవర్ సాంగ్ కోసమే ప్రొడ్యూసర్స్ 40 లక్షల దాకా ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే భారీ అంచనాలు ఉన్న ఈ మల్టీస్టారర్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :