“భీమ్లా” సెన్సేషన్..100 మిలియన్ క్లబ్ లో ఫస్ట్ సాంగ్.!

Published on Dec 15, 2021 6:45 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి కాంబోలో యంగ్ దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న భారీ మాస్ యాక్షన్ డ్రామా “భీమ్లా నాయక్”. సాలిడ్ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని మేకర్స్ ఆల్ మోస్ట్ షూటింగ్ ని కంప్లీట్ చేసేసారు. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రంపై ఇంతలా హైప్ రావడానికి ప్రధాన కారణాల్లో పవన్ మాస్ ప్రెజెన్స్ ఒక కారణం అయితే ఇంకొకరు ఈ సినిమా సంగీత దర్శకుడు థమన్ అని చెప్పాలి.

తన పాటలు అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఇంకో స్థాయికి తీసుకెళ్లాడు. అయితే ఈ సినిమా నుంచి ఎన్నో అంచనాలు నడుమ విడుదల అయ్యిన మొదటి సాంగ్ భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ భారీ రెస్పాన్స్ ని అందుకొని దూసుకెళ్లింది. అయితే ఇదొక్కటే కాకుండా ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్డ్ టాలీవుడ్ సాంగ్ గా కూడా ఇది నిలిచింది.

మరి ఇప్పుడు ఈ సాంగ్ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ మార్క్ ని టచ్ చేసి సరికొత్త రికార్డు ని సెట్ చేసింది. మొత్తం రెండు ఛానెల్స్ లో రిలీజ్ చేసిన ఈ సాంగ్ 70, 30 మిలియన్ వ్యూస్ తో కలిపి 100 మిలియన్ వ్యూస్ ని కొల్లగొట్టింది. మొత్తానికి మాత్రం భీమ్లా నాయక్ ఆడియో క్లియర్ కట్ హిట్ అని మళ్ళీ ప్రూవ్ అయ్యింది.

సంబంధిత సమాచారం :