అప్పటికి కంప్లీట్ అయ్యిపోనున్న “భీమ్లా నాయక్”.!

Published on Nov 30, 2021 7:15 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మాస్ సినిమా “భీమ్లా నాయక్”. మాస్ ఆడియెన్స్ లో మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రం నుంచి ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని కూడా చిత్ర యూనిట్ రివీల్ చేశారు. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా కంప్లీట్ చేసుకుంటూ ముగింపుకి వస్తుంది.

మరి దీనిపైనే ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. భీమ్లా నాయక్ చిత్రం టాకీ పార్ట్ అంతా కూడా ఈ వచ్చే డిసెంబర్ మూడో వారానికల్లా కంప్లీట్ అయ్యిపోతుందట. అక్కడ నుంచి పవన్ హరిహర వీరమల్లు షూట్ కి పవన్ సిద్ధం కానున్నారట. మరి ఈ చిత్రంలో నిత్యా మీనన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :