భీమ్లా నాయక్ ట్రైలర్: రేపటి నుండి సిసలైన జాతర షురూ

Published on Feb 20, 2022 6:04 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడగా, తాజాగా ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను రేపు విడుదల చేయనున్నారు మేకర్స్. విడుదల కి ఇంకా 5 రోజులు మాత్రమే ఉండటం తో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాక ట్రైలర్ విడుదల తో సిసలైన పండుగ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తుండగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :