‘జాతి రత్నం’తో ‘భీమ్లా’ మేకర్స్ సరికొత్త ప్రాజెక్ట్.!

Published on Sep 15, 2021 10:00 am IST


ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ గా నిలిచిన కొద్ది చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన హిలేరియస్ ఎంటర్టైనర్ చిత్రం “జాతి రత్నాలు” కూడా ఒకటి. మరి “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నవీన్ మరిన్ని ఆసక్తికర ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. అలా ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ తో సినిమా అనౌన్స్ అయ్యింది.

వీరితో పాటుగా వీరికి అత్యంత సన్నిహితుడు అయిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా తన సరికొత్త బ్యానర్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ తో కలిసి ఓ క్లీన్ ఎంటర్టైనర్ ని అనౌన్స్ చేశారు. మరి అలాగే ఈ సినిమాని నూతన దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించనున్నారు. మరి ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ వారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “భీమ్లా నాయక్” సహా మరెన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :