టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ త్వరలోనే ‘భోగి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఒక పక్కా ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. రక్షాబంధన్ పండగ సందర్భంగా ఆగస్టు 28న ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా లెవెల్లో ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ సినిమా కోసం శర్వానంద్ తన కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కష్టతరమైన యాక్షన్ సీన్స్‌లో నటించినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. రామ్ చరణ్ కెరీర్‌ను ‘రంగస్థలం’ సినిమా ఎలాగైతే మలుపు తిప్పిందో, శర్వానంద్ కెరీర్‌కు ‘భోగి’ కూడా అదే స్థాయి గుర్తింపు తెచ్చిపెడుతుందని టాక్ నడుస్తోంది. అయితే ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయనేది సినిమా థియేటర్లలోకి వస్తేనే క్లారిటీ వస్తుంది.
ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ అయింది. త్వరలోనే చిత్ర బృందం ప్రమోషన్స్ కూడా ప్రారంభించనుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మి రాధామోహన్ సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్ కాన్వాస్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో శర్వానంద్ సరసన
