ఆత్మహత్య చేసుకున్న హీరోయిన్ !
Published on Jun 20, 2017 11:14 am IST


బోజ్పురి నటి అంజలి శ్రీవాత్సవ సోమవారం ముంబైలో ఉన్న తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. స్థానిక పోలీసుల కథనం మేరకు అంజలి కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి నుండి ఆమెను ఫోన్ ద్వారా సంప్రదించాలని ప్రయత్నించగా ఆమె స్పందించలేదు. దీంతో కంగారును గురైన వారు అంజలి నివాసముండే ఇంటి యొక్క యజమానులకు ఫోన్ చేయగా వాళ్ళు పోలీసులకు సమాచారమిచ్చారు.

ఆ సమాచారంతో జుహు రోడ్లోని పరిమళ్ సొసైటీలో ఉన్న అంజలి నివాసానికి చేరుకున్న పోలీసులు డూప్లికేట్ తాళం చెవితో డోర్ ఓపెన్ చేసి చూడాగా అంజలి సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని విగత జీవిగా కనిపించింది. వెంటనే విషయాన్ని కుటుంబ సభ్యులు తెలిపిన పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్. ఎన్. కూపర్ హాస్పిటల్ కు తరలించారు. అనంతరం ఆమె నివాసాన్ని పరిశీలించిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలు, ఆధారాలేవీ లభించలేదని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.

29 ఏళ్ళ అంజలి తాజాగా ‘కెహు తా దిల్ మే బా’ చిత్రంలో నటించగా గతంలో ‘గోపాల్ రాయ్, ఆదిత్య కశ్యప్, రాజా, ప్రేమ్ దూబే’ వంటి చిత్రాల్లో ప్రముఖ పాత్రలు పోషించింది.

 
Like us on Facebook