‘శర్వానంద్’ కు విలన్ గా భోజ్ పూరి స్టార్

4th, August 2016 - 09:10:21 AM

shrawanand-ravi-kishan
తన నటనతో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో గా పేరు తెచ్చుకున్న ‘శర్వానంద్’ ప్రస్తుతం కొత్త దర్శకుడు ‘చంద్రమోహన్’ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో శర్వానంద్ ఓ పోలీస్ ఆఫీసర్ రోల్ లో మెప్పించనున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగే ఈ సినిమాలో శర్వా కు విలన్ గా భోజ్ పూరి సూపర్ స్టార్ ‘రవి కిషన్’ నటిస్తున్నాడు.

తన వైవిధ్యభరితమైన నటనతో సినిమా వెయిట్ పెంచే ఈ నటుడు గతంలో రేసు గుర్రం, కిక్ – 2, సుప్రీం వంటి చిత్రాల్లో విలన్ గా మెప్పించి ఆ సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాంటి టాలెంటెడ్ నటుడు శర్వానంద్ కు విలన్ గా నటిస్తుండటంతో ఈ సినిమాపై సినీ జనాల్లో ఆసక్తి రేగుతోంది. ఇకపోతే ‘బివిఎస్ఎన్’ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ సరసన ‘లావణ్య త్రిపాఠి’ హీరోయిన్ గా నటిస్తోంది.