మెగాస్టార్ చిరంజీవి కి గ్రాండ్ వెల్ కమ్ ఇచ్చిన “భోళా శంకర్” టీమ్!

మెగాస్టార్ చిరంజీవి కి గ్రాండ్ వెల్ కమ్ ఇచ్చిన “భోళా శంకర్” టీమ్!

Published on Jan 19, 2023 6:08 PM IST

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య చిత్రం గ్రాండ్ సక్సెస్‌తో దూసుకుపోతున్నారు. చిరు కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఈ చిత్రం నిలిచిపోతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఈ భారీ సక్సెస్ తో, అజిత్ యొక్క వేదాళం అధికారిక రీమేక్ అయిన భోళా శంకర్ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు చిరు. భోళా శంకర్ చిత్ర యూనిట్ సినిమా సెట్‌లో చిరుకు గ్రాండ్ వెల్ కమ్ ఇచ్చింది.

భోళా శంకర్ వెల్ కమ్స్ వాల్తేరు వీరయ్య అంటూ చిత్ర యూనిట్ జోష్ ను నింపింది. అంతేకాక ఈ రెండు చిత్రాలకు సంబందించిన గెటప్ లతో కూడిన కేక్ ను మెగాస్టార్ చిరు కట్ చేశారు. మరింత జోష్ తో ఈ చిత్రాన్ని షురూ చేశారు. భోళా శంకర్‌లో మెగాస్టార్ చిరు సోదరిగా నటించిన కీర్తి సురేష్, చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ మరియు నిర్మాత అనిల్ సుంకర మరియు ఇతర నటీనటులు మరియు సిబ్బంది చిరుకు పూల బొకేలతో స్వాగతం పలికి వాల్తేరు వీరయ్య ఘనవిజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు