యూఎస్ లో భారీ రిలీజ్ తో “భోళా శంకర్”.!

Published on Jun 3, 2023 9:00 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు మెహర్ రమేష్ తో తెరకెక్కిస్తున్న మాస్ చిత్రం “భోళా శంకర్” కోసం తెలిసిందే. మరి ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ కి సిద్ధం అవుతుండగా మేకర్స్ కూడా ఈ చిత్రం నుంచి అయితే ఆల్రెడీ సాలిడ్ అప్డేట్స్ కూడా స్టార్ట్ చేసేసారు. మరి ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ని అయితే మేకర్స్ రిలీజ్ చేస్తుండగా ఈ సినిమాపై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి తెలుస్తుంది.

మరి ఈ చిత్రం అయితే యూఎస్ లో భారీ రిలీజ్ కి రెడీ అవుతుందట. లాస్ట్ సెన్సేషనల్ హిట్ “వాల్తేరు వీరయ్య” తో మెగాస్టార్ తన మాస్ రేజ్ ని యూఎస్ లో కూడా కనబరిచారు. ఇక ఇదే హవా లో భోళా శంకర్ యూఎస్ లో ఏకంగా 600 కి పైగా లొకేషన్స్ లో అయితే రిలీజ్ కావడానికి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి యూఎస్ లో ఈ చిత్రంని ప్రత్యంగిరా సినిమాస్ వారు డిస్ట్రిబ్యూషన్ చేయనుండగా ఆగస్ట్ 10 షోస్ తో అయితే యూఎస్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :