“భోళా శంకర్” నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ ఎప్పటినుంచంటే?

Published on Jun 11, 2022 3:00 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వేదాళం రీమేక్ ‘భోళా శంకర్’. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం కొత్త షూటింగ్ షెడ్యూల్ జూన్ 21 నుంచి ప్రారంభం కానున్నట్టు చిత్ర బృందం తెలిపింది. ‘మెగావైబ్’తో కొత్త షెడ్యూల్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది.

ఇదిలా ఉంటే ఈ కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తుండగా, తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందించారు. ఈ ఏడాది చివరలో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :