ఫోటో షూట్ మరియు లుక్ టెస్ట్ పూర్తి చేసుకున్న భోళా శంకర్..!

Published on Nov 8, 2021 11:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం రెండు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న లూసిఫర్ రీమేక్ “గాడ్ ఫాథర్” ఒకటి కాగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ ‘భోళా శంకర్’ సినిమా ఒకటి. అయితే ఇందులో ఆల్రెడీ గాడ్ ఫాథర్ సినిమా షూటింగ్ మొదలైపోగా, ‘భోళా శంకర్’ కూడా షూటింగ్ ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకుంది.

ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ‘భోళా శంకర్’ సినిమా నవంబర్ 11న పూజా కార్యక్రమాలు జరుపుకుని నవంబర్ 15 నుంచి రెగ్యులర్ షూట్‌ని మొదలుపెట్టబోతుంది. ఇదిలా ఉంటే తాజాగా నేడు భోళా శంకర్ టెస్ట్ లుక్ మరియు ఫోటో షూట్‌ని పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఇకపోతే ఈ చిత్రంలో చిరుకి చెల్లెలిగా కీర్తి సురేష్ నటించబోతుంది.

సంబంధిత సమాచారం :

More