ప్రైమ్ వీడియోలోకి వచ్చిన అజయ్ దేవగణ్ “భోళా”…ట్విస్ట్ ఇదే!

Published on May 11, 2023 3:30 pm IST

బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్ టైటిల్ పాత్రలో ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం భోళా. ఈ చిత్రం ప్రైమ్ వీడియో లోకి వచ్చేసింది. అయితే ట్విస్ట్ ఏమిటంటే, ఈ చిత్రాన్ని చూసేందుకు 399 రూపాయలను పే చేయాల్సి ఉంది. అజయ్ దేవగన్ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టబు మరియు అమలా పాల్ ముఖ్యమైన పాత్రలు పోషించారు.

తమిళం లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఖైతీ కి ఈ చిత్రం అధికార రీమేక్. ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. అజయ్ దేవగన్ ఎఫ్ ఫిల్మ్స్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్, టి సిరీస్ మరియు రిలయన్స్ ఎంటర్టైన్‌మెంట్‌ల నిర్మించిన ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :