“భోళా శంకర్” మరింత లేట్.?

Published on Feb 4, 2023 12:53 am IST


ప్రస్తుతం మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “వాల్తేరు వీరయ్య” తో మళ్ళీ బాక్సాఫీస్ దగ్గర తన అసలు సిసలైన ట్రాక్ లోకి తాను వచ్చారు. దీనితో తన నెక్స్ట్ సినిమా “భోళా శంకర్” రీమేక్ అయినప్పటికీ ముందు మీద కొంచెం బజ్ అయితే వచ్చింది. కానీ ఈ సినిమా రిలీజ్ కి సంబంధించి అయితే ఎప్పటికప్పుడు పలు ఆసక్తికర బజ్ లు వినిపిస్తున్నాయి.

మొదటగా ఈ సినిమా అయితే ఈ ఏప్రిల్ లో రిలీజ్ కి ఫిక్స్ చేయగా తర్వాత అది మే లోకి వెళ్లినట్టుగా టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ సినిమా మరో నెల వెనక్కి వెళ్లినట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. దీనితో ఈ చిత్రం జూన్ నెలలో వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇవన్నీ ప్రస్తుతానికి రూమర్స్ మాత్రమే కాగా ఇందులో ఎంతవరకు నిజముందో కాలమే నిర్ణయించాలి. ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ చిరు సోదరి పాత్రలో నటిస్తుంది అలాగే మెహర్ రమేష్ ఈ సినిమాని దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :