ఓటిటిలో “భోళా శంకర్” ర్యాంపేజ్.!

Published on Sep 17, 2023 10:01 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన రీసెంట్ యాక్షన్ డ్రామా “భోళా శంకర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం అయితే అనుకున్న రేంజ్ సక్సెస్ కాలేకపోయింది. ఇక ఇలా థియేట్రికల్ రన్ అనంతరం అయితే ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ఇప్పుడు పాన్ ఇండియా భాషల్లో అయితే అందుబాటులోకి వచ్చింది. మరి నెట్ ఫ్లిక్స్ లో అయితే ఈ సినిమా సక్సెస్ అయ్యింది అనే చెప్పాలి.

తెలుగు సహా హిందీ భాషల్లో అయితే ఈ సినిమా ఇప్పుడు ఇండియా టాప్ 10 ట్రెండింగ్ లిస్ట్ లో నిలిచింది. మరి తెలుగులో అయితే నెంబర్ 1 స్థానంలో హిందీలో టాప్ 10 లో నిలిచి సాలిడ్ రెస్పాన్స్ ని ఇక్కడైతే అందుకుంది. ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్ కూడా నటించగా మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత అనీల్ సుంకర ఈ సినిమాని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :