భూల్ భూలాయియా 2 డిజిటల్ ప్రీమియర్ కి రెడీ!

Published on Jun 17, 2022 8:00 pm IST

9

బాలీవుడ్ యొక్క తాజా హిట్ చిత్రం భూల్ భూలాయియా 2 అతి త్వరలో డిజిటల్ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉంది. కార్తిక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ హారర్ కామెడీ చిత్రానికి అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. తాజా వార్త ఏమిటంటే, భూల్ భూలయ్యా 2 తన ప్లాట్‌ఫారమ్‌లో జూన్ 19, 2022న ప్రదర్శించబడుతుందని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.

OTT దిగ్గజం ఆన్‌లైన్‌లో ప్రమోషనల్ వీడియోను కూడా విడుదల చేసింది. టీ సిరీస్ మరియు సినీ1 స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద 175 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో టబు, రాజ్‌పాల్ యాదవ్ తదితరులు నటించడం జరిగింది.

సంబంధిత సమాచారం :