మహేష్ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ ?

మహేష్ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ ?

Published on Feb 20, 2023 9:00 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమాని పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా బాలీవుడ్ హీరోయిన్ భూమి పడ్నేకర్ ను ఓ కీలక పాత్ర కోసం తీసుకోబోతున్నారు. ఆమె పాత్ర సినిమా సెకండ్ హాఫ్ లో వస్తుందని, ఆమె ఓ లేడీ కానిస్టేబుల్ పాత్ర చేస్తోందని తెలుస్తోంది. ఐతే, ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ సినిమాలో మహేష్ కి హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది.

మొత్తానికి త్రివిక్రమ్ ఈ చిత్రానికి నటీనటులను ఎంపిక చేస్తున్న విధానం చాలా ఆసక్తికరంగా ఉంది. పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు