ప్రభాస్ “సలార్” ఎలా ఉంటుందో చెప్పిన కేజీఎఫ్ సినిమాటోగ్రాఫర్

Published on May 16, 2022 2:30 pm IST

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తదుపరి చిత్రం సలార్. KGF ఫ్రాంచైజీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ బహుభాషా చిత్రం మళ్లీ వార్తల్లో నిలిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ మాట్లాడుతూ, “మేకింగ్, బ్యాక్‌డ్రాప్ పరంగా కేజీఎఫ్ కంటే సలార్ 2, 3 రెట్లు పెద్దదని అన్నారు. ఈ చిత్రం గురించి మరింతగా మాట్లాడుతూ, ప్రశాంత్ నీల్ దీనిని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నందున చాలా డిఫరెంట్‌గా చిత్రీకరించాలనుకుంటున్నాడు” అని అన్నారు.

సినిమాటోగ్రాఫర్ చెప్పిన ఈ మాటలు విన్న ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మే 17, 2022న తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించే ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం :