మరో క్లీన్ హిట్ గా “బిచ్చగాడు 2”.!

Published on May 24, 2023 7:01 am IST

కోలీవుడ్ మల్టీ టాలెంటెడ్ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి విజయ్ ఆంటోనీ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ సినిమానే “బిచ్చగాడు 2”. మరి ఈ చిత్రం తమిళ్ మరియు తెలుగులో కూడా రిలీజ్ కాగా ఈ చిత్రం తమిళ్ కంటే బెటర్ వసూళ్లను విజయ్ ఆంటోనీ కెరీర్ లోనే ఎక్కువ వసూళ్లను తెలుగులో అందుకుంది.

ఇక మొదటి రోజు వసూళ్లతోనే ఈ చిత్రం తెలుగు లాభాలు ఇస్తుంది అని ఫిక్స్ కాగా ఇపుడు అయితే ఈ సినిమా టాలీవుడ్ లో ఈ ఏడాదికి మరో క్లీన్ హిట్ లిస్ట్ లో నిలిచినట్టుగా తెలుస్తుంది. తెలుగులో అయితే ఈ చిత్రం పెట్టుకున్న టార్గెట్ ని ఈ సోమవారం వసూళ్లతోనే హిట్ స్టేటస్ సాధించి అదరగొట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి కూడా విజయ్ ఆంటోనీ సంగీతం అందించగా కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. అలాగే నెక్స్ట్ “బిచ్చగాడు 3” కి కూడా విజయ్ ఆంటోనీ సన్నాహాలు చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :