“బిచ్చగాడు 2” స్ట్రీమింగ్ పార్ట్నర్ లాక్.!

Published on May 19, 2023 10:00 am IST

కోలీవుడ్ టాలెంటెడ్ నటుడు సంగీత దర్శకుడు ఇప్పుడు దర్శకుడు అయినటువంటి విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “బిచ్చగాడు 2” కోసం అందరికీ తెలిసిందే. మరో గతంలో వచ్చిన “బిచ్చగాడు” చిత్రం తెలుగు సహా తమిళ్ లో అఖండమైన విజయాన్ని సొంతం చేసుకుంది. దీనితో పార్ట్ 2 ని స్వయంగా విజయ్ ఆంటోనీ నే టేకప్ చేసి భారీ బడ్జెట్ తో అయితే తెరకెక్కించాడు.

ఇక ఎట్టకేలకు ఈరోజు తెలుగు సహా తమిళ్ లో ఏకకాలంలో అయితే రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం తాలుకా ఓటిటి హక్కులపై అయితే ఇప్పుడు క్లారిటీ తెలుస్తుంది. ఈ చిత్రం తాలూకా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ డిస్నీ+ హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నారు. దీనితో థియేట్రికల్ రిలీజ్ అనంతరం అయితే హాట్ స్టార్ లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. ఇక ఈ చిత్రానికి సంగీతం విజయ్ ఆంటోనీ అందించగా ఫాతిమా ఆంటోనీ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :