లేటెస్ట్ : ఆసక్తికరంగా బిచ్చగాడు – 2 ‘స్నీక్ పీక్’ ట్రైలర్

Published on Feb 10, 2023 6:00 pm IST


ఏడేళ్ల క్రితం విజయ్ ఆంటోనీ హీరోగా శశి దర్శకత్వంలో తెరకెక్కిన బిచ్చగాడు మూవీ ఎంతో పెద్ద సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈమూవీకి ఇటీవల సీక్వెల్ ని ప్రారంభించారు విజయ్. ఆయన స్వయంగా నటిస్తూ, దర్శకత్వం వహించిన బిచ్చగాడు 2 నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.

ఇక నేడు కొద్దిసేపటి క్రితం ఈ మూవీ నుండి మొదటి 3.52 నిమిషాల నిడివి గల స్నీక్ పీక్ ట్రైలర్ ని యూట్యూబ్ లో విడుదల చేసారు మేకర్స్. బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ వంటి ఆసక్తికర ఎలిమెంట్స్, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ తో తెరకెక్కిన ఈ స్నీక్ పీక్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. కాగా మనీ ఈజ్ ఇంజురియస్ టూ ద వరల్డ్ అనే కాన్సెప్ట్ తో రూపొందిన బిచ్చగాడు 2 మూవీ సమ్మర్ 2023 కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది. విజయ్ ఆంటోని ఫిలిమ్స్ కార్పొరేషన్ సంస్థపై ఫాతిమా విజయ్ ఆంటోని ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :