‘బిచ్చగాడు – 2’ సక్సెస్ మీట్ డేట్ ఫిక్స్

Published on May 25, 2023 5:16 pm IST


విజయ్ ఆంటోని హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ బిచ్చగాడు 2. కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని ఫాతిమా విజయ్ ఆంటోనీ భారీ వ్యయంతో నిర్మించారు. ఇటీవల మంచి అంచనాలతో తెలుగు, తమిళ భాషల ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం మంచి కలెక్షన్స్ తో కొనసాగుతోంది.

ఇక తెలుగులో మూవీకి మరింతగా ఆదరణ లభిస్తుండడంతో యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్స్ కి వెళ్లి ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు విజయ్ ఆంటోనీ. కాగా మ్యాటర్ ఏమిటంటే, బిచ్చగాడు 2 సక్సెస్ మీట్ ని మే 27 న వైజాగ్ లోని ఆర్కె బీచ్ రోడ్ లో గల గోకుల్ పార్క్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ ప్రకటించారు. మరి రాబోయే రోజుల్లో ఈ మూవీ టోటల్ గా ఎంత మేర కలెక్ట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :