‘బిచ్చగాడు – 2’ టీమ్ నుండి ఇంట్రస్టింగ్ అప్ డేట్

Published on Feb 10, 2023 2:34 am IST


విజయ్ ఆంటోని హీరోగా శశి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ బిచ్చగాడు. 2016లో రిలీజ్ అయి అతి పెద్ద విజయం అందుకున్న ఈ మూవీ యాక్షన్ అండ్ హార్ట్ టచింగ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి అందరి నుండి మంచి స్పందన అందుకుంది.

ఇక ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతోంది బిచ్చగాడు 2. విజయ్ ఆంటోనీ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సమ్మర్ కానుకగా అతి త్వరలో ప్రేక్షకాభిమనుల ముందుకి రానుంది. కాగా అనౌన్స్ అయిన దగ్గరి నుండి అందరిలో ఈ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

అలానే ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్ మరింతగా ఆసక్తిని రేకెత్తించాయి. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ నుండి మొదటి 4 నిమిషాల స్నీక్ పీక్ వీడియోని రేపు సాయంత్రం 5 గంటలకి రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ప్రకటించారు. కావ్య థప్పర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :