తెలుగు రాష్ట్రాల్లో ‘బిచ్చగాడు’ ప్రభంజనం !

Bichagadu

సాధారణంగా తమిళ హిట్ సినిమాల్ని తెలుగులోకి డబ్ చేయడం పాత విషయమే. ఇలాంటి డబ్బింగ్ సినిమాలు మహా అయితే ఒక మాదిరిగా ఆడి ఏవైనా పెద్ద హీరోల సినిమాలు రిలీజైతే వెళ్లిపోతుంటాయి. కానీ బిచ్చగాడు చిత్రం మాత్రం పవన్, మహేష్ బాబు ల సినిమాల్ని సైతం వెనక్కి నెట్టి ఊహించని స్థాయిలో అద్భుత విజయం సాధించింది. ఈ చిత్రం ఇప్పటి వరకూ రూ. 20 కోట్లకు పైగానే వసూళ్లు సాధించి ఈరోజుటితో తెలుగు రాష్ట్రాల్లో 100 రోజులు పూర్తిచేసుకోనుంది.

తల్లి కోసం సర్వసం వదులుకున్న ఓ కొడుకు వాస్తవ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రధానంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు విపరీతంగా కనెక్టయింది. అంతేగాక విడుదలైన వారం తరువాత జనాల్లో మొదలైన పాజిటివ్ మౌత్ టాక్ ఈ చిత్ర విజయానికి కీలకమైంది. ఇంతటి విజయం సాధించిన ఈ చిత్రం వచ్చే వారాంతంలో యూఎస్ లో సైతం విడుదలకానుంది. ‘శశి’ దర్శకత్వంలో ‘విజయ్ ఆంటోనీ’ నటించిన ఈ చిత్రాన్ని ‘చదలవాడ తిరుపతి రావు’ తెలుగు ప్రేక్షకులకు సమర్పించారు.