అడివి శేష్ “మేజర్” నుండి రేపు బిగ్ అనౌన్స్మెంట్!

Published on May 22, 2022 5:30 pm IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మేజర్. శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం లోని నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

తాజాగా ఈ చిత్రం నుండి మరొక అనౌన్స్ మెంట్ పై క్లారిటీ వచ్చింది. రేపు ఉదయం 11:07 గంటలకు బిగ్ అనౌన్స్ మెంట్ ఉండనున్నట్లు సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది.ఈ అప్డేట్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :