“గుడ్ లక్ సఖి” నుంచి రాబోతున్న బిగ్ అనౌన్స్‌మెంట్..!

Published on Jan 21, 2022 2:24 am IST

కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’. స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ రైఫిల్‌ షూటర్‌గా కనిపించనుంది. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నగేష్ కుకునూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ పతాకంపై సుధీర్ చంద్ర పాదిరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంకి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు ఇప్పటికే ప్రేక్షకులని అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ రాబోతుంది. ఈ రోజు సాయంత్రం 3:33 నిమిషాలకు ఓ అనౌన్స్‌మెంట్‌ని ప్రకటించనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఈ అనౌన్స్‌మెంట్‌లో సినిమా రిలీజ్ తేదినీ ఏమైనా ప్రకటిస్తారా అనేది చూడాలి మరీ. ఇదిలా ఉంటే ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :