లేటెస్ట్..కలిసి సినిమాలు చేయనున్న రెండు బిగ్ బ్యానర్స్!

Published on Oct 30, 2021 2:00 pm IST

ఓ సినిమా ప్రేక్షకుడి దగ్గరకి వచ్చింది అంటే దాని వెనుక ఉన్న టీం ఆ టీం వెనుక ఉండి చివరి వరకు నడిపించిన నిర్మాతలే అందుకు మూల కారణం. అలా ఎన్నో బ్యానర్స్ భారతీయ సినిమా దగ్గర ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించారు. అయితే పలు సందర్భాల్లో ఒకే సినిమాని ఒక్క బ్యానర్ లోనే కాకుండా రెండు మూడు నిర్మాణ సంస్థలు కూడా తెరకెక్కించిన దాఖలాలు కోకొల్లలు.

మరి అలా మన టాలీవుడ్ కి చెందిన రెండు బెస్ట్ క్వాలిటీ కంటెంట్ అందించే బిగ్ బ్యానర్స్ ఇప్పుడు రానున్న రోజుల్లో కలిసి పని చెయ్యడానికి రెడీ అయ్యినట్టుగా బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థల అధినేతలు ఆసియన్ సునీల్ అలాగే అభిషేక్ అగర్వాల్ లు ఇప్పుడు సంయుక్తంగా సినిమాలు నిర్మించేందుకు సిద్ధం అయ్యారు. అలాగే వీరి కలయికలో ఓ భారీ ప్రాజెక్ట్ ని కూడా లాక్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఆ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :