‘సైరా నరసింహారెడ్డి’ లో అమితాబ్ పాత్ర ఇలానే ఉంటుందట ?


చిరంజీవి తన 151వ సినిమాగా స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను చేయనుండటం ఒక విశేషమైతే అందులో జాతీయస్థాయి నటుడు, బాలీవుడ్ షహన్షా అమితాబ్ బచ్చన్ నటిస్తుండటం మరో విశేషం. అమితాబ్ చేరికతో ఈ భారీ చిత్రం నేషనల్ లెవల్లో గుర్తింపు పొందుతోంది. ఇకపోతే చిత్రంలో అమితాబ్ ఏ పాత్ర చేయబోతున్నారనే ప్రశ్న కూడా గత కొన్నిరోజులుగా అభిమానుల్లో, ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతూ వస్తోంది.

సినీ వర్గాల్లో వినబడుతున్న వార్తల ప్రకారం అమితాబ్ చిరంజీవికి గురువుగా నటిస్తాడట. అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంలో, తిరుగుబాటులో ప్రధాన పాత్ర పోషించిన, గురువుగా వ్యవహరించిన గోసాయి వెంకన్న పాత్రను అమితాబ్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంతమేరకు నిజముందో తెలియాలంటే మెగా క్యాంప్ నుండి క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే. రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయనున్నారు.