రెమ్యునరేషన్ లేకుండా సినిమాల్లో నటిస్తున్న బిగ్ బాస్ సెలబ్రెటీ !

nuthan naidu1

బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో సామాన్యుడు గా ఎంట్రీ ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు నూతన్ నాయుడు. తన టైమింగ్, రైమింగ్ తో బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నూతన్ నాయుడు ఇప్పుడు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. అందులో భాగంగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన మల్టీ స్టారర్ మూవీ ఎఫ్ 2 లో నూతన్ నాయుడు ఒక ముఖ్య పాత్రలో నటించాడని ఇంతకుముందే 123 తెలుగు వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాతో పాటు నూతన్ నాయుడు కి ఒకే సారి 14 సినిమాల్లో ఆఫర్లు వచ్చాయని కొన్ని సినిమాలకు సైన్ కూడా చేసినట్టు సమాచారం. అందులో ‘ఆర్ఆర్ఆర్ , సైరా’ లాంటి క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయట. ఇక బిగ్ బాస్ 2 లో రెమ్యునేరేషన్ తీసుకోకుండా పాల్గొన్న నూతన్ నాయుడు తను నటిస్తున్న సినిమాలకు కూడా రెమ్యునేరేషన్ తీసుకోవడం లేదట. పైగా తన ట్రావెల్ ఖర్చులు, బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చులు కూడా తానే పెట్టుకుంటున్నట్టు నూతన్ నాయుడి సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి.

Exit mobile version