భారి సినిమా సీక్వెల్ కు ట్రైలర్ వస్తుంది !

4th, November 2017 - 03:39:26 PM

కమల్ హాసన్ ఈ మధ్య సినిమా వార్తల్లో కంటే రాజకీయపరంగా ఎక్కువ వార్తల్లో నిలుస్తున్నాడు. కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యాలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్న ఈ లోకనాయకుడు నటించిన సినిమా ట్రైలర్ అతని పుట్టినరోజు కానుకగా విడుదల చెయ్యాలని భావిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే…

కమల్ హాసన్ ఎప్పటినుంచో నటిస్తున్న విశ్వరూపం 2 సినిమా మళ్ళీ తెరపైకి వస్తోంది. ఈ సినిమా నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ఆర్ధిక ఇబ్బందులతో సినిమా మధ్యలోనే వెళ్లిపోయారు. ఆ తరువాత కమల్ తన సొంత డబ్బుతో ఈ సినిమా పూర్తి చేస్తుసున్నాడు. నవంబర్ 7 న తన పుట్టినరోజు నాడు ట్రైలర్ విడుదల చెయ్యబోతున్నాడు. ట్రైలర్ ఏలా ఉండబోతోందో చూడాలంటే కమల్ అభిమానులు కొన్ని రోజులు ఆగాల్సిందే. విశ్వరూపం సినిమా మంచి విజయం సాధించింది. ఆ సినిమా తరహాలోనే ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.