ప్రభాస్ నెక్స్ట్ సినిమా బడ్జెట్ రూ.150 కోట్లా !

Prabhas
‘బాహుబలి’ లో నటించాక యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ నేషనల్ లెవల్ హీరో అయిపోయాడు. దాదాపు నాలుగేళ్లు ‘బాహుబలి’ కోసం వెచ్చించాడు ప్రభాస్. ప్రస్తుతం బాహుబలి 2 కూడా ఫినిషింగ్ లో ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న సినిమా విడుదలకానుంది. దీంతో అభిమానుల్లో ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతోంది అనే ఆతురత పెరిగిపోయింది. ప్రభాస్ నెక్స్ట్ సినిమాని సుజిత్ డైరెక్ట్ చేస్తాడని ఇప్పటికే కన్ఫర్మ్ అయిపొయింది. ఈ సినిమా కూడా బాహుబలి రేంజ్ లో కాకపోయినా భారీ బడ్జెట్ చిత్రమేనట.

సినిమా వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ బడ్జెట్ రూ. 150 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ టాప్ టెక్నీషియన్లు పనిచేయనున్నారట. అలాగే ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళంలలో కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్ననారట. ఈ ప్రాజెక్టును యువీ క్రియేషన్స్ బ్యానర్ ఫై ప్రభాస్ కు అత్యంత సన్నిహితులైన ప్రమోద్, వంశీ లు నిర్మించనున్నారు.