“RRR” క్లైమాక్స్ పై బిగ్ బజ్..ఆ ఒక్క ఎపిసోడ్ కే భారీ ఖర్చు.?

“RRR” క్లైమాక్స్ పై బిగ్ బజ్..ఆ ఒక్క ఎపిసోడ్ కే భారీ ఖర్చు.?

Published on Jan 25, 2022 6:24 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తీసిన భారీ పాన్ ఇండియన్ సినిమా “రౌద్రం రణం రుధిరం” ఇప్పుడు రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యి ఉన్నారు.

ఇక ఈ గ్యాప్ లో ఈ సినిమాకి సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఊహించని అంశాలే వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమాకి సంబంధించి క్లైమాక్స్ పై ఒక షాకింగ్ బజ్ వినిపిస్తుంది. సినిమాలో ఈ ఒక్క క్లైమాక్స్ పార్ట్ కే మేకర్స్ ఏకంగా 100 కోట్లు ఖర్చు చేశారట. అంటే ఈ సినిమాలో క్లైమాక్స్ ఏ లెవెల్లో ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు.

అంతే కాకుండా ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ దాదాపు 40 నిమిషాల పాటు ఉంటుందని మరో ఇంట్రెస్టింగ్ టాక్ కూడా వినిపిస్తుంది. ఇలా ఓవరాల్ గా ఈ ఊహించని టాక్ “RRR” సినిమాపై వినిపిస్తుంది. ఇక ఈ భారీ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందివ్వగా డీవీవీ దానయ్య 500 కోట్ల మేర భాయీ బడ్జెట్ తో నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు