రవితేజ సిస్టర్ గా ‘జాతి రత్నాలు’ హీరోయిన్ ?

Published on May 30, 2022 5:06 pm IST

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ.. ఈ క్రమంలో నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ధమాకా’ చేస్తున్నాడు. అయితే, ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా కనిపించబోతుంది. జాతి రత్నాలు హీరోయిన్ ‘ఫరియా అబ్దుల్లా’ ఓ కీలక పాత్రలో నటించబోతుంది. ఆమెది రవితేజకు సిస్టర్ క్యారెక్టర్ అని టాక్ నడుస్తోంది.

మరి చూడాలి, సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో. జాతి రత్నాలు సినిమాలో కథానాయకగా నటించి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు గ్లామర్ తో యూత్ ని బాగా ఆకట్టుకుంది ఫరియా అబ్దుల్లా. తాజాగా రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అయితే, ఈ వార్త పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా నటిస్తే ఆమె కెరీర్ కి ప్లస్ అవుతుంది.

సంబంధిత సమాచారం :