‘ధమాకా’లో అలరించబోతున్న ‘నభా నటేష్’ ?

Published on Mar 28, 2022 7:05 pm IST

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ.. ఈ క్రమంలో నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ధమాకా చేస్తున్నాడు. అయితే, ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందని.. ఆ పాత్రలో యంగ్ హీరోయిన్ ‘నభా నటేష్’ నటిస్తోందని తెలుస్తోంది. ‘నన్ను దోచుకుందువటే’ చిత్రం తో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ గ్లామర్ బ్యూటీ.

ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ లో కథానాయకగా నటించి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు గ్లామర్ తో యూత్ ని బాగా ఆకట్టుకుంది. తాజాగా రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అయితే, ఈ వార్త పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి ఈ సినిమాలో నభా నటిస్తే కెరీర్ కి ప్లస్ అవుతుంది. ఇక ఈ సినిమాలో రవితేజ కొత్తగా కనిపిస్తాడని తెలుస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేసిన ‘క్రాక్’ సినిమాతో రవితేజకు పూర్వవైభవం వచ్చింది. కాకపోతే రవితేజ ఖిలాడి సినిమాతో మళ్ళీ ప్లాప్ ట్రాక్ లోకి వచ్చాడు.

సంబంధిత సమాచారం :