‘స్పైడర్’ చిత్ర హక్కులకు భారీ గిరాకీ !


మహేష్ – మురుగదాస్ ల కలయికలో రూపొందిన చిత్రం ‘స్పైడర్’ పై ప్రేక్షకుల్లో ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో చెప్పనక్కర్లేదు. ఈ భారీ అంచనాల మూలానే చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ ఎత్తున జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క కృష్ణా జిల్లా హక్కులు రూ.5.4 కోట్ల పెద్ద మొత్తానికి అమ్ముడైనట్లు తెలుస్తోంది.

కృష్ణా జిల్లా ఏరియాలో మహేష్ సినిమా హక్కులు ఇంత ఎక్కువ డీల్ కు అమ్ముడవడం ఇదే మొదటిసారి. అలాగే మహేష్ ఈ చిత్రంతో తమిళ పరిశ్రమలో అధికారికంగా లాంచ్ అవుతుండటంతో ఈ నెల 9న చెన్నైలో గ్రాండ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. మహేష్ బాబు సీబీఐ అధికారిగా కనిపించనున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా మెరవనుంది. సెప్టెంబర్ 27న సినిమాను భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో, తమిళంతో పాటు ఇంకొన్ని హిందీ, మలయాళం, అరబిక్ వంటి ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు.